Alarulu Kuriyaga


అలరులు గురియగ నాడెనదే అలకల గులుకుల నలమేలుమంగ అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ మట్టపు మలపుల మట్టెలకెలపుల తట్టెడి నడపుల దాటెనదే పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ చిందుల పాటల శిరిపొలయాటల అందెల మ్రోతల నాడె నదే కందువ తిరువెంకటపతి మెచ్చగ అందపు తిరుపుల నలమేలుమంగ alarulu guriyaga naaDenadae alakala gulukula nalamaelumaMga araviri sobagula nativalu mechchaga ara tera maruguna naaDe nadae varusaga poorvadu vaaLapu tirupula hari garagiMpuchu nalamaelumaMga maTTapu malapula maTTelakelapula taTTeDi naDapula daaTenadae peTTina vajrapu peMDepu daLukulu aTTiTTu chimmuchu nalamaelumaMga chiMdula paaTala SiripolayaaTala aMdela mrOtala naaDe nadae kaMduva tiruveMkaTapati mechchaga aMdapu tirupula nalamaelumaMga